పులివెందుల: మిస్సింగ్ ఘటనలో విషాదం

వీరపునాయిని పల్లె మండలంలోని పాలగిరి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి జనవరి 14వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శనివారం ఓబుళరెడ్డిపల్లె పొలాల్లో పూర్తిగా దెబ్బతిన్న ఒక శవం ఆనవాళ్లు లభించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ శవం అతనిదని గుర్తించారు.

సంబంధిత పోస్ట్