కడప జిల్లా పులివెందుల పట్టణంలోని అలవలపాడు రోడ్డులో ఉన్న తూర్పు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు గళ్ళ చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసినవారు స్థానిక పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.