పులివెందుల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

సింహాద్రిపురం మండలం ఆంకాళమ్మ గూడూరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ను వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అనంతపురం జిల్లా యాడికి మండలాని చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్