కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం హామీ నెరవేర్చిందని టిడిపి నాయకులు తెలిపారు. శనివారం వేంపల్లి పట్టణంలో వారు మాట్లాడుతూ భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం మరింత పతిష్టగా ముందుకు వెళ్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, తల్లివందనం లబ్ధి పొందిన విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.