వేంపల్లి: రాష్ట్రంలో ఉన్నత విద్య పడకేసింది: తులసి రెడ్డి

నిధుల , సిబ్బంది కొరత కారణంగా రాష్ట్రం లో ఉన్నత విద్య పడకేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. ఆదివారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 17 విశ్వ విద్యాలయాలు ఉండగా 9 విశ్వ విద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లు లేరన్నారు. విశ్వ విద్యాలయాలలో474 ప్రొఫెసర్ పోస్టులు, 859 అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు, 2147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ గా ఉన్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్