కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రసాయన ఎరువుల ధరలు అమాంతంగా పెంచడం అన్యాయం, దుర్మార్గం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక వైపు వర్షాలు పడక, గిట్టుబాటు ధర లభించక, అన్నదాత సుఖీభవ పథకం అమలు కాక రైతులు లబోదిబో అంటుంటే గోరు చుట్టు మీద రోకటి పోటులా మోదీ ప్రభుత్వం రసాయన ఎరువుల ధరలు అమాంతంగా, భారీగా పెంచిందన్నారు.