రైల్వేకోడూరులో రైలు బోగిపై మృతదేహం కలకలం

రైల్వేకోడూరులో బుధవారం రాత్రి హుబ్లీ–తిరుపతి ఇంటర్‌సిటీ ప్యాసింజర్ రైలులో కలకలం రేగింది. అనంతరాజుపేట సమీపంలో రైల్వే బోగీపై నిప్పులు చిమ్మినట్టు కనిపించి, శబ్దం రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు రైల్వేకోడూరు చేరుకోగానే అధికారులు దాన్ని నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ బోగీపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడి గుర్తింపుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్