రైల్వే కోడూరు రంగనాయకుల పేటకు చెందిన కోలా శ్రీనివాసులు (38) గురువారం కువైట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు రంగనాయకులు పేటలో ఉన్న ఇల్లు అమ్ముకొని జీవనోపాధి కోసం భార్యాభర్తలు కువైట్ వెళ్లారు. వెళ్లిన మూడు నెలలకే శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.