పుల్లంపేట చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడి పట్టివేత

పుల్లంపేట మండలంలో మహిళ మెడలోని బంగారు గొలుసును కత్తితో బెదిరించి లాక్కొని పారిపోయిన కేసును పుల్లంపేట పోలీసులు ఛేదించారు. ఈ నెల 5న సిగమలా అన్నపూర్ణ మెడలోని 3 తులాల బంగారు గొలుసును రాజంపేట అహ్మద్‌నగర్‌కు చెందిన మోహన్ అనే వ్యక్తి లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసి మోహన్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 3.5 లక్షల విలువైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్