చిట్వేల్ కేజీబీవీలో సుస్థిర ఆహార వ్యవస్థపై అవగాహన

అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు పరిధిలోని చిట్వేల్ కేజీబీవీ పాఠశాలలో బుధవారం బ్రిక్స్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ వీక్-2026 కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు సుస్థిర ఆహార వ్యవస్థపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ తులసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించారు. ఆహార వృథాను అరికట్టడం, స్థానిక ఆహార పదార్థాల వినియోగం మరియు ప్రకృతి వనరుల సంరక్షణ గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తామని విద్యార్థినులు ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕