చిట్వేలు: అన్నపై తమ్ముళ్లు కత్తులతో దాడి

చిట్వేలు హరిజనవాడలో సింగనమల సుబ్బ నాగులు పై బుధవారం తన తమ్ముళ్లు కత్తులతో దాడి చేసి గాయపరిచారని చిట్వేలి పోలీసులు తెలిపారు. తమ్ముళ్లు లేనిపోని అబద్ధాలు చెప్పి తన భార్యను తనకు కాకుండా చేశారని ఫోన్ లో వేరే వారితో మాట్లాడుతుండగా అది విన్న సింగనమల నాగార్జున, సింగనమల సుభాష్ చంద్రబోస్ అన్నపై దాడి చేశారు. చేతికి, మెడకు గాయాలు కాగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్