చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో శనివారం ఏకైక విద్యార్థిని ఆనందల మల్లిక ఉత్తీర్ణులయ్యారు. 474 మార్కులకు గాను 294 మార్కులు సాధించారు. 78 మంది పరీక్ష రాయిగా 77 మంది ఫెయిల్ అయ్యారు. చిట్వేలులో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశారు కానీ లెక్చరర్లు, ప్రిన్సిపాల్ లేకుండానే సంవత్సరం పూర్తి అయిపోయింది. అధికారులు లెక్చరర్లను నియమించాల్సి ఉంది.