తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలోని దేమాచుపల్లిలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన లడ్డూ వేలం ఘనంగా జరిగింది. భక్తుల భారీ ఉత్సాహం మధ్య మన్నూరు వెంకటసుబ్బారెడ్డి రూ. 35 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ వేలంతో గ్రామంలో భక్తి సందడి నెలకొంది. గ్రామస్థులు ఆయనను అభినందించారు.