అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరుగుతున్న రాజకీయ ఘర్షణలపై సీపీఎం రైల్వేకోడూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. శనివారం కన్వీనర్ సిహెచ్. చంద్రశేఖర్, సభ్యులు పందికాళ్ల మణి, ఓబిలి పెంచలయ్య, పి. జాన్ ప్రసాద్లు మాట్లాడుతూ పార్టీల మధ్య దాడులు, ప్రతిదాడులు ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, ప్రతి అభ్యర్థికి స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా శాంతిభద్రతలను కాపాడాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.