పెట్రోల్ బంకు వద్ద ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి

ఓబులవారిపల్లి మండలం మంగంపేట పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక జనసేన నాయకుడు మంగారపు నరసింహులు (50) మృతి చెందారు. మంగంపేటలోని తన మిల్లు నుండి తిరిగి ఇంటికి బైకుపై వస్తుండగా, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మరణించినట్లు సమాచారం. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్