రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే మృతి

ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన 1999లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయినా, 2004లో కోడూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్