రైల్వే కోడూరు మండలం చియ్యవరం కమ్మపల్లెలో శనివారం ఇంటి ప్రహరీ గోడ విషయంలో జరిగిన వివాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తనపై దాడి చేశారని బాధితురాలు రాజేశ్వరి తెలిపారు. తీవ్రంగా గాయపడిన రాజేశ్వరి ని బంధువులు చికిత్స నిమిత్తం తిరుపతి లోని ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే కోడూరు ఎస్సై నవీన్ బాబు తెలిపారు.