ట్యాంకర్ లారీ, మరో లారీని ఢీకొన్న ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. బుధవారం ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి క్రాస్ వద్ద మహారాష్ట్రకు చెందిన ట్యాంకర్ లారీ కర్ణాటకకు చెందిన లారీని ఢీకొట్టింది. ట్యాంకర్ డ్రైవర్ క్యాబిన్ లోపల ఇరుక్కుపోవడంతో స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు వివరించారు. ఘటన స్థలానికి ఓబులవారిపల్లి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ కు గాయాలు కావడంతో రైల్వేకోడూరు ఆసుపత్రికి తరలించారు.