ఓబులవారిపల్లె మండలంలోని రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుండి కడప కు వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. రెండు కార్లలో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కార్లలో ఉన్న వారికి పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న ఓబులవారిపల్లి పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ మహేష్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.