తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండల పరిధిలోని కేజీబీవీ పాఠశాలలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా బుధవారం వ్యాసరచన పోటీ నిర్వహించారు. చిట్వేల్ ఎస్సై వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలో విద్యార్థులు పటేల్ జీవితం, దేశ సమైక్యత, జాతీయ సమగ్రతపై తమ ఆలోచనలను వ్యాసాల రూపంలో వ్యక్తం చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఓ. ఇందు ప్రథమ, పదో తరగతి ఎన్. తేజస్విని ద్వితీయ, ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎస్. సౌందర్య తృతీయ బహుమతులు సాధించారు. విజేతలను ఎస్సై అభినందించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపల్ తులసి, విద్యార్థులు పాల్గొన్నారు.