చిట్వేలిలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు మండల కేంద్రమైన చిట్వేలిలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ ఉండదని అధికారులు తెలిపారు. డీటీఆర్‌ కింద కేబుల్ మార్పిడి పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని, అంబేద్కర్ సర్కిల్ పరిధిలోని ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చిట్వేలి ఏఈ బాలకృష్ణ కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕