పుల్లంపేట మండలం అనంత సముద్రం గ్రామానికి ఉత్తరం వైపున ఊరు గట్టు వద్ద ఐదుగురు ఎర్రచందనం కూలీలను అరెస్టు చేసి.. వారి వద్ద నుండి 15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట డీఎస్పి సుధాకర్ తెలిపారు. శనివారం రాజంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 15 ఎర్రచందనం దుంగల విలువ 4లక్షల 31వేల 200 ఉంటుందని, వాటితో పాటుగా 2 బైకులు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.