పుల్లంపేట మండలం టి. కమ్మపల్లె వద్ద ఉన్న బోటుమీద పల్లె బ్రిడ్జి పై వరద నీరు ప్రవహిస్తోంది. బోటుమీదపల్లె వద్ద నీటి ప్రవాహం ఆదివారం రాత్రి అంతా ఇదే విధంగా కొనసాగితే పోలి చెరువు అలుగు పొర్లడంతో పాటు రాజంపేట మండలంలోని పలు చెరువులు జలకళ సంతరించుకుంటాయి. రైల్వేకోడూరు, తిరుమల వర్షపు నీరు బోటుమీదపల్లె, పీవీజీపల్లె, పుల్లంగేరు, ఊటుకూరు వద్ద ఉన్న గరండాల మీదుగా పోలి చెరువుకు చేరుతుంది.