రైల్వే కోడూరు మండల పరిధిలోని సెట్టిగుంట గ్రామం వద్ద శుక్రవారం మహారాష్ట్రకు చెందిన జీపు బోల్తా పడింది. మహారాష్ట్ర నుండి ఓ కుటుంబం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో జీబులో ప్రయాణిస్తున్న వారికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. 108కి సమాచారo ఇవ్వడంతో వారు వెంటనే సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.