తిరుమలకు పాదయాత్రగా వెళుతున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పుల్లంపేట రెడ్డిపల్లి చెరువు కట్టపై బుధవారం కారు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు వివరించారు. కడప జిల్లా వీరపనాయని పల్లి మండలం అనుంపల్లి పంచాయతీకి చెందిన కొండయ్య (45) గా గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.