కోడూరు మండలంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓబనపల్లి అరుంధతి వాడకు చెందిన శివకుమార్ (26) అనే యువకుడు మృతి చెందాడు. మైసూరవారిపల్లి పంచాయతీ పరిధిలోని మామిడికాయల యార్డ్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. శివకుమార్ కారులో తిరుపతి వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.