బొమ్మవరం: గ్రామంలో వైభవంగా ఆలయ పునఃప్రతిష్ఠ

శ్రీ పర్వతవర్థిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవం ఏప్రిల్ 11 నుండి 14వ తేదీ వరకు ఓబులవారిపల్లి మండలం బొమ్మవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. శిఖర జీవధ్వజ, నవగ్రహాల సమేతంగా ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో శాసనసభ్యులు అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి పాల్గొని స్వామి, అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్