రైల్వేకోడూరు: విషాదం.. ముగ్గురు మృతి

రైల్వే కోడూరులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. కర్నూలుకు చెందిన సిరి చందనకు తిరుపతికి చెందిన రోహిత్ తో 20వ తేదీన వివాహం జరిగింది. బుధవారం పెళ్లి రిసెప్షన్ కొరకు తిరుపతికి కారులో వెళ్తూ.. రైల్వే కోడూరు వద్ద బస్సు ఢీకొని నలుగురు గాయపడ్డ విషయం తెలిసిందే. వారిలో సుచిత్ర (49), ప్రేమ కుమార్ (55), ఆయన భార్య వాసవి (45) మృతి చెందారని గురువారం పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్