ఓటు మీ ఆయుధం: ఓటర్లకు అవగాహన కల్పించిన వైసీపీ నాయకులు

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంగంపేటలో ఆదివారం ఓటర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్యుమరేషన్ పత్రాలను పూర్తి చేసి గడువులోపు బీఎల్ఓలకు అందజేయాలని రాయలసీమ జోన్ వైసీపీ బూత్ కమిటీ అధ్యక్షులు, డీఆర్‌యూసీసీ సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి కోరారు. "మీ ఓటు మీ ఆయుధం. మీ ఓటు హక్కును కాపాడుకోండి" అని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఏ వెంకటేష్‌తో పాటు పవన్, శీను, రమణ, గంగాధర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్