రైల్వే కోడూరు లో సోమవారం జరిగిన సీతారాముల కళ్యాణం వేడుకలో పలువురు గొడవపడ్డారు. ఊరేగింపు పగడాల పల్లె నుండి చిట్వేలుకు వెళ్లే రోడ్డు లోకి రాగానే గౌరీ శంకర్ కత్తితో గోవిందు చేతన్ పై దాడి చేశాడు. ఈ దాడిలో గోవింద చేతన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.