కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజంపేట నియోజకవర్గంలో ప్రభుత్వ, అసైన్డ్, దళితుల భూములు వందల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గొంటు మణి మంగళవారం ఆరోపించారు. రాజంపేట లోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బినామీలపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సర్వే నంబర్లు, ఆధారాలతో ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు