రాజంపేట మండలం బాలరాజుపల్లి సమీపంలోని చెయ్యేరు నదిలో శుక్రవారం రాత్రి ఎలుగుబంటి సంచరించిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇసుక రవాణా రహదారిపై ఎలుగుబంటి పరుగులు తీస్తుండగా యువకులు వీడియో తీశారు. ఈ ఘటనతో గ్రామస్తులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. చెయ్యేరు పరిసరాలు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.