అన్నమయ్య జిల్లా కడప - చెన్నై జాతీయ రహదారిపై పుల్లంపేట వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొండలరావు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన బేల్దారి కొండలరావుగా గుర్తించారు.