నందలూరులో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు

నందలూరు సమీపంలో గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు స్కూటర్‌ను ఢీకొన్న ఘటనలో శంకర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కడప నుంచి రాజంపేట వైపు వెళ్తున్న బస్సు నందలూరు చెక్‌పోస్ట్ వద్ద ఈ ప్రమాదానికి కారణమైంది. గాయపడిన వ్యక్తిని స్థానికులు రాజంపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనతో ఆగ్రహించిన బంధువులు బస్టాండ్ వద్ద బస్సును అడ్డుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది, ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్