టపాసుల గోడౌన్ లో భారీ పేలుడు

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లెలోని పాత అమ్మవారిశాల వీధి లో ఉన్న టపాసుల గోదాములో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ గోడౌన్ కు అతి సమీపంలో ట్రాన్స్ఫార్మర్ ఉండడం విశేషం. ఎండ వేడికి రోడ్డు మీద జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు రావడం, దట్టమైన పొగను చూసిన స్థానికులు నీటితో మంటలను అదుపు చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్