నందలూరు రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం కలగోట్ల సిద్దయ్య (45) గూడ్స్ రైలు కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటనపై జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ సుభాన్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ వీధి, రంగసముద్రం, పోరుమామిళ్ళ కు చెందిన సిద్దయ్య రైలు కింద పడి మృతి చెందడం జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ హాస్పిటల్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.