నందలూరు: మంత్రి చేతుల మీదుగా విద్యార్థికి ప్రతిభా అవార్డు

నందలూరు మండలం అరవపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎంపీసీ విభాగం నందు 1000 మార్కులకు 987 మార్కులు సాధించినందుకు ఉత్తమ ప్రతిభా అవార్డుకు ఎంపికయ్యారని ఉపాధ్యాయుడు రౌఫ్ భాష తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మహతి ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో రెవిన్యూ శాఖ మంత్రి సత్య ప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం మరియు రూ. 20 వేలు చెక్కును అందుకున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్