ఒంటిమిట్ట: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఒంటిమిట్ట మం. నడింపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నంద్యాల జిల్లాకు చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతికి వెళ్తున్న స్కార్పియో వాహనం.. అటువైపుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, పోలీసు వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో జీపులో ఉన్న నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. మృతులు నంద్యాల జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ రఘునాథరెడ్డితో డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్