ఒంటిమిట్ట పీఎస్ ఎదుట మృతదేహంతో ధర్నా

రైలు కిందపడి లాలయ్య (51) మృతి చెందిన ఘటనపై పోలీసుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుమారుడు రఫీ ఆధ్వర్యంలో ఆదివారం ఒంటిమిట్ట పీఎస్ ఎదుట రోడ్డుపై మృతదేహంతో ధర్నా చేపట్టారు. ఖాదర్ బాషా బెదిరింపులకు గురయ్యామని, పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలిపారు. ఈ ధర్నాతో కడప-రేణిగుంట రహదారిపై 20 నిమిషాల ట్రాఫిక్ నిలిచింది. సీఐ బాబు హామీతో ధర్నా విరమించారు.

సంబంధిత పోస్ట్