రాష్ట్రంలో పేదవారు ఆకలితో ఉండరాదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నా క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తున్నారని టిడిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి, మాజీ ఎంపిటిసి ఓబినేని సుబ్బమ్మ అన్నారు. శుక్రవారం రాజంపేటలో ఆమె మాట్లాడుతూ పేదవారి ఆకలి తీర్చడమే టిడిపి అంతిమ లక్ష్యమని అన్నారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలను ఒకటొకటిగా నెరవేరుస్తున్నారని ఆమె తెలిపారు.