అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు సమీపంలో సోమవారం రాత్రి మూడు బైకులు ఢీకొన్న ఘటనలో గుంటూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మోహన్ కృష్ణ మృతి చెందినట్లు రాజంపేట పోలీసులు తెలిపారు. రామాపురానికి చెందిన నరసింహులు, మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.