సిద్దవటం మండలం టక్కోలు గ్రామపంచాయతీ సర్పంచ్, బి లక్ష్మీదేవి, ఉప సర్పంచ్ నిమ్మకాయల లక్ష్మీదేవి తమ పదవులకు బుధవారం రాజీనామా చేశారు. డిపిఓ ప్రభాకర్ రెడ్డి వివరణ కోరగా టక్కోలు గ్రామ మహిళా సర్పంచ్ లక్ష్మీదేవి, ఉప సర్పంచ్ నిమ్మకాయల లక్ష్మీదేవి పదవులకు బుధవారం మా కార్యాలయంలో లిఖితపూర్వకంగా రాజీనామా పత్రం సమర్పించారని, ఎన్నికల కమిషనర్ కు పంపించడం జరుగుతుందని, తదుపరి ఎలక్షన్ తేదీ ప్రకటిస్తామని అన్నారు.