రాజంపేట మండలంలోని పోలి సమీపంలో ఆదివారం సాయంత్రం కారు, ఆటో ఢీకొన్న ఘోర ప్రమాదంలో బద్వేలుకు చెందిన సలీం (42) అనే పండ్ల వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందారు. రాజంపేట నుంచి పోలి వైపు వెళ్తున్న కారు, పెనగలూరు నుంచి రాజంపేట వైపు వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.