గుప్తనిధుల కోసం దేవాలయం రాతి తొలగింపు: సర్పంచ్ ఫిర్యాదు

వీరబల్లి మండలం మట్లి పంచాయతీలోని తొగటపల్లె మాండవ్య నది ఒడ్డున ఉన్న ప్రాచీన కోదండరామస్వామి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవుని పాదాలు, శంకు, చక్రం సంబంధ రాతిని తొలగించారని సర్పంచ్ సోమారపు నాగార్జునచారి స్థానిక ఎస్ఐ సుస్మితకు శనివారం ఫిర్యాదు చేశారు. గతంలో కూడా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయని, ఈసారి కూడా అదే ఉద్దేశంతో రాతిని తొలగించారని తెలిపారు. ఎస్ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్