పాఠశాల ఆకస్మిక తనిఖీ

ఒంటిమిట్ట మండల పరిధిలోని ఒంటిమిట్ట హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో ఎంఈఓ డి ప్రభాకర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన విద్యార్థుల చేత చతుర్విధ ప్రక్రియలను చేయించారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల చేత ఆంగ్ల, తెలుగు పాఠాలను చదివించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపాలయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్