శనివారం ఉదయం కడప–చెన్నై జాతీయ రహదారిపై సిద్దవటం మండలం మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై హైవే పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.