నందలూరు మండలం పొత్తపి గ్రామంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం విష్ణుమూర్తి ఆయుధమైన సుదర్శన చక్రానికి అర్చకులు శ్రీ షహపురం గోపీనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుదర్శన చక్రాన్ని దర్శించుకోవడం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాలు, భయాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని అర్చకులు భక్తులకు వివరించారు.