అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలో కడప - తిరుపతి ప్రధాన రహదారిపై శనివారం తుఫాన్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.