రాపూరులో సోమవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. తిక్కన పార్క్ వద్ద ఆరబోసిన ధాన్యాన్ని చూడడానికి సరస్వతి, సురేష్ తో కలిసి మోటార్ బైకు పై బయలుదేరారు. రాజంపేట వీఆర్ఓ రామచంద్రయ్య, ఉపాధ్యాయుడు మల్లికార్జున మద్యం మత్తులో రాపూరు నుండి కారులో చిట్వేలు వైపు వేగంగా వస్తూ వారిని ఢీకొట్టారు. సరస్వతి, సురేష్ అక్కడికక్కడే మరణించారు. కారులో ఉన్న వారిని స్థానికులు పోలీసులకు అప్పగించారు.