చికిత్స పొందుతూ యువకుడు మృతి

సుండుపల్లి మండలం మడితాడు గ్రామం జి.కె. రాచపల్లెకు చెందిన ఎస్. రిజ్వాన్ (22) చెన్నైలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ నెల 23న రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బొలెరో ఢీకొంది. తీవ్రంగా గాయపడటంతో మొదట తిరుపతి, వేలూరు ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మృతుడికి ఏప్రిల్ లో వివాహం కాగా గర్భిణిగా ఉన్న భార్య కన్నీరుమున్నీరైంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕